పోరాటాన్ని కొనసాగించండి: నందమూరి సుహాసిని        

  • అమరావతి ప్రాంతంలో పర్యటించిన సుహాసిని
  • రైతులు, మహిళలకు సంఘీభావం
  • మహిళలు ఏకమైతే రాజ్యాలు కూలిపోతాయని వ్యాఖ్య
దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె, టీడీపీ నాయకురాలు సుహాసిని ఈరోజు అమరావతి ప్రాంతంలో పర్యటించారు. మందడంలో నిరసన దీక్షను చేపట్టిన రైతులకు, మహిళలకు ఆమె సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, రైతులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పారు. పోరాటాన్ని ఆపవద్దని కోరారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాజధాని ప్రాంత మహిళలపై పోలీసుల లాఠీఛార్జీని ఖండిస్తున్నానని చెప్పారు. మహిళలు ఏకమైతే రాజ్యాలు కూలిపోతాయని హెచ్చరించారు. అమరావతి ఉద్యమాన్ని మహిళలు, రైతులు ధైర్యంగా కొనసాగించాలని అన్నారు.
Go Back to Shorts
Nandamuri Suhasini
Amaravati
Telugudesam

More Telugu News